కృష్ణవేణి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ - ముఖ్య అతిథిగా హాజరైన ACP మడత రమేష్.

కృష్ణవేణి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ - ముఖ్య అతిథిగా హాజరైన ACP మడత రమేష్.
నేటి చర్చ,రామగిరి, నవంబర్ 07, స్థానిక కల్వచర్ల లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన సెంటినరీ కాలనీ లోని మార్కెట్ రోడ్ నుండి పాఠశాల వరకు సుమారు 600 మంది విద్యార్థిని, విద్యార్థులచే భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నకు రామగుండం ACP మడత రమేష్,మంథని CI స్వామి , రామగిరి SI శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి కార్యక్రమంను ఉద్దేశించి ACP మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు ఇప్పటి అలవాటై యువత భవిష్యత్తు కోల్పోతుందని, విద్యార్థులు మొబైల్ ఫోన్ లకు అలవాటై వారి భవిష్యత్తును అంధకారం లోకి వెళ్తున్నారని అలా కాకుండా విద్యార్థిని, విద్యార్థులు ఆటస్థలం లోని ఆటలకు అలవాటై ఆరోగ్య వంతంగా ఉండాలని, మంచిగా చదువుకుని చదువుతున్న పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు, వారి ఊరికి మంచి పేరు తీసుకు రావాలని తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన కృష్ణవేణి పాఠశాల మేనేజ్ మెంట్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు మరియు డ్రగ్స్ భూతం అలంకరణ అబ్బాయి వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమం లో పాఠశాల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్, డైరెక్టర్ శ్రీధర్ బాబు, రంజిత్ రెడ్డి మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
