స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై కారులో భారీ అగ్నిప్రమాదం.

Views :0
స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై కారులో భారీ అగ్నిప్రమాదం.
Car Fire accident

స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లీకేజీ కారణంగా ఓ డస్టర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది.

నేటి చర్చ : స్టేషన్ ఘన్పూర్, నేషనల్ హైవే పై కారు దగ్ధం, డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు డస్టర్ కారులో హనుమకొండ నుంచి మల్లన్నగండికి వెళ్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపైకి చేరుకోగానే కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి.దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును రహదారి పక్కన నిలిపివేశాడు. అనంతరం కారులో ఉన్న ఇద్దరూ వెంటనే కిందకు దిగారు. కొద్దిసేపటికే డీజిల్ లీకేజీ కారణంగా కారులో మంటలు చెలరేగి చూస్తుండగానే వాహనం మొత్తం వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.దీంతో పెను ప్రమాదం తప్పింది. కళ్ల ముందే కారు మంటల్లో కాలిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm