నేటి చర్చ : కరీంనగర్, పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ – సీసీఎస్ (CCS) కరీంనగర్

నేటి చర్చ : కరీంనగర్, పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ – సీసీఎస్ (CCS) కరీంనగర్
‘యూనిక్ మెర్కంటైల్ ఇండియా’, ‘స్వయం మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ’ పేర్లతో అధిక లాభాలు, రియల్ ఎస్టేట్, వెకేషన్ ప్యాకేజీల ఆశ చూపి ప్రజలను మోసగించిన కేసులో (కరీంనగర్-II టౌన్ క్రైమ్ నం. 212/2026) ఐదుగురు కీలక నిందితులను CCS పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో దాదాపు ₹26 నుంచి ₹28 కోట్ల వరకు మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కైలాష్ రాయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ జైలులో ఉన్నాడు.
అరెస్టయిన నిందితులు:
గుడిపాటి గాంధీ (హైదరాబాద్)
మాకలసోంపల్లి కరియప్ప (హైదరాబాద్)
ఉల్లిగడ్డల సంగప్ప (హైదరాబాద్)
కొమిరె భూమా గౌడ్ (నిజామాబాద్)
యేదెళ్ల రమేష్ (పెద్దపల్లి)
గమనిక: ఈ సంస్థల చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా నేరుగా CCS-కరీంనగర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరడమైనది.
