గంజాయి అక్రమ దందాపై మరిపెడ పోలీసుల ఉక్కుపాదం.రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్.

Views :0
గంజాయి అక్రమ దందాపై మరిపెడ పోలీసుల ఉక్కుపాదం.రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్.
Ganja peddlers arrested

గంజాయి అక్రమ దందాపై మరిపెడ పోలీసుల ఉక్కుపాదం.రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్.

నేటి చర్చ : మరిపెడ, గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై మరిపెడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తొర్రూరు రోడ్డులోని మరిపెడ శివారు డబుల్ బెడ్‌రూం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా సుమారు రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గంజాయిని చిన్నప్యాకెట్లుగా తయారుచేసి మరిపెడ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది. ఈ..కేసులో పవార్ విజయ్, కంది అభిరామ్, బానోత్ మణిదీపక్‌ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్ హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ..ఆపరేషన్‌లో *మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్‌* తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm