ఖమ్మంపాడులో మైనర్ బాలిక అదృశ్యం.

ఖమ్మంపాడులో మైనర్ బాలిక అదృశ్యం.
=> పోలీసులను ఆశ్రయించిన పెద్దమ్మ.
=> కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అశ్వారావుపేట పోలీసులు.
నేటి చర్చ క్రైమ్ :- అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బాలిక తల్లి పదేళ్ల క్రితం మృతి చెందగా, తండ్రి కూడా బాలిక సంరక్షణ బాధ్యతలు పట్టించుకోకపోవడంతో ఆమెను పెద్దమ్మ చిచ్చోడి చంద్రమ్మ పెంచి పోషిస్తోంది.
ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో తన పెద్దమ్మ కుమారుడైన కోనే సీతారామయ్య ఇంటికి వెళ్లి వస్తానని పెద్దమ్మ చంద్రమ్మకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. అయితే ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
బాలిక ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో పెద్దమ్మ చిచ్చోడి చంద్రమ్మ అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించింది.
దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ బి. సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
