హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ(ఏక్తా దివాస్) వేడుకలు.

Views :0
హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ(ఏక్తా దివాస్) వేడుకలు.
SP Rohit Raj, DSP Adhinarayana and Others

హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ(ఏక్తా దివాస్) వేడుకలు.

నేటి చర్చ : ఎస్పీ కార్యాలయం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

తేదీ:31.10.2026, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను ఏకీకృతం చేసి, భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు పునాది వేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అపారమని కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటంలో పోలీస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు న్యాయం అందించేలా, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసింగ్‌లో క్రమశిక్షణ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల పట్ల గౌరవం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి అంకితభావంతో పనిచేస్తామని, దేశ సమైక్యతను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm