న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ అవగాహన కార్యక్రమం.

న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ అవగాహన కార్యక్రమం.
నేటి చర్చ : రామవరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ది : 30-10-2026 న, న్యాయ సేవాదికార సంస్థ ఆదేశాముల మేరకు సుజాతనగర్ మండలం గరీబ్ పేట జడ్పీహెచ్ఎస్ స్కూల్ మరియు రామవరం లోని నేతాజీ బస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యొక్క కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా లీగల్ ఎయిడ్ న్యాయవాది సాహితీగారు ,మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారా లీగల్ వాలంటీర్ బండి విజయభాస్కర్ గారు పాల్గొనడం జరిగింది. గరీబ్ పేట జడ్పీహెచ్ఎస్ స్కూల్ , మరియు రామవరం నేతాజీ జడ్పీ హైస్కూల్ ల నందు విద్యార్థులకు చట్టాలపై అవగాహన , పిల్లల హక్కులు, తదితర విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. తదనంతరం
ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులచేప్రతిజ్ఞ చేపించినారు.ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో కలిగి ఉండాలని అలాగే విద్యార్థులకు ఏ సమస్యలు వచ్చినా ఇంట్లో తల్లిదండ్రులకు, పాఠశాలలో ఉపాధ్యాయులకు నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్.1098 కు సమాచారం ఇవ్వాలని చూచించడం జరిగింది .
లేదా లీగల్ హెల్ప్ లైన్ నెంబర్.15100 కు
కాల్ చేసిన వెంటనే సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాలల హెడ్ మాస్టర్లు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు సఫియా గారు, విజయ గారు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
