నేటి చర్చ : కొత్తగూడెం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,తేదీ:27-10-2026 సింగరేణి అధికారిక క్వార్టర్‌లో రాజకీయ, రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

Views :0
నేటి చర్చ : కొత్తగూడెం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,తేదీ:27-10-2026 సింగరేణి అధికారిక క్వార్టర్‌లో రాజకీయ, రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
Representation by BJP dist President Byreddy Prabhakar Reddy to Singareni officer

నేటి చర్చ : కొత్తగూడెం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,తేదీ: 27-10-2026 సింగరేణి అధికారిక క్వార్టర్‌లో రాజకీయ, రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

దసరా పర్వదినం సందర్భంగా రావణాసుర దహనం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన క్వార్టర్‌లో దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ జ్ఞానేష్ కుమార్ గారి చిత్రపటాలను రావణాసురుడి రూపంలో ఏర్పాటు చేసి దహనం చేసిన ఘటనపై భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు సింగరేణి అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సదరు క్వార్టర్ ఎవరి పేరుపై కేటాయించబడింది, ఏ ప్రాతిపదికన కేటాయించారు, ప్రస్తుతం దానిని ఎవరు వినియోగిస్తున్నారు అనే తదితర వివరాలను సంబంధిత అధికారులను కోరారు. సింగరేణి సంస్థకు చెందిన అధికారిక ఆస్తిని రాజకీయ పార్టీ కార్యాలయంగా ఉపయోగించడం, ఆ ప్రాంగణంలో వివాదాస్పదమైన మరియు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.సింగరేణి అధికారులు ఈ వినతిపై సానుకూలంగా స్పందించి, సదరు క్వార్టర్‌కు సంబంధించిన వివరాలను సంబంధిత విభాగానికి తెలియజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని, సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్‌ను నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకోవాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సింగరేణి సంస్థ ప్రజల ఆస్తి. సంస్థకు చెందిన అధికారిక క్వార్టర్లను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం, వాటిలో వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలను సంస్థ అధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సదరు క్వార్టర్‌ను నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకోవాలి” అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, భారతీయ జనతా యువమోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జుజ్జూరు మోహనకృష్ణ, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్ తదితరులు పాల్గొని సింగరేణి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm