నేటి చర్చ : రుద్రంపూర్,చుంచుపల్లి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దీపావళి, సమాధుల పండుగ సమీపిస్తున్న తరుణంలో రుద్రంపూర్ లో గల స్మశాన వాటికలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా వినతి పత్రం.

నేటి చర్చ : రుద్రంపూర్,చుంచుపల్లి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దీపావళి, సమాధుల పండుగ సమీపిస్తున్న తరుణంలో రుద్రంపూర్ లో గల స్మశాన వాటికలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా వినతి పత్రం.
రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్మశాన వాటిక వద్ద 02-11-2026 (సోమవారం) మరియు 08-11-2026 (ఆదివారం) తేదీలలో సమాధుల పండుగ మరియు దీపావళి సందర్భంగా ప్రజలు తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు.
కావున, ప్రజల సౌకర్యార్థం స్మశాన వాటిక పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, సంబంధిత సిబ్బందితో ముందుగానే శుభ్రపరిచే పనులు చేపట్టవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ రుద్రంపూర్ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో 7 వ వార్డ్ నెంబర్ గంట స్వరూప, గూడెల్లి ముఖేష్ నే.డీ రవితేజ, గట్టు రాకేష్, యాటకారి సుమంత్, మొహమ్మద్ మున్నవార్,అజార్,రెడ్డి పవన్, తదితరులు పాల్గొన్నారు.
