త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హైదరాబాద్ లో పూర్తవ్వగానే జిల్లాల్లో-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Views :0
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హైదరాబాద్ లో పూర్తవ్వగానే జిల్లాల్లో-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Minister Ponguleti Srinivas Reddy

త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హైదరాబాద్ లో పూర్తవ్వగానే జిల్లాల్లో-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

నేటి చర్చ : హైదరాబాద్, 11 నవంబర్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రిని కలిసి, ఇటీవల జరిగిన తమ సంఘ రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చేసిన సానుకూల ప్రకటనపై తమ సంఘ కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ప్రక్రియను వేగవంతం చేసి జర్నలిస్టుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించాలని

ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్లు విరాహత్ అలీ, రాంనారాయణలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మరో ప్రధాన సమస్య అయిన ఆరోగ్య పథకాన్ని అమలు చేసి, జర్నలిస్టుల ప్రాణాలకు ప్రభుత్వం భద్రతా కల్పించాలని తమ సంఘం చేసిన తీర్మానాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ ముందుగా హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు చేపడతామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్ లు ఉన్నారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm