గురుకులంలో ర్యాగింగ్ కలకలం.. పదో తరగతి విద్యార్థిపై నలుగురి దాడి.

Views :0
గురుకులంలో ర్యాగింగ్ కలకలం.. పదో తరగతి విద్యార్థిపై నలుగురి దాడి.

గురుకులంలో ర్యాగింగ్ కలకలం.. పదో తరగతి విద్యార్థిపై నలుగురి దాడి.

నేటి చర్చ : పెద్దపల్లి, గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ దాడికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకులంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై నలుగురు తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

బ్లాంకెట్ విషయంలో మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థి వీపు, ముఖంపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

గాయపడిన విద్యార్థికి ప్రిన్సిపాల్ ప్రథమ చికిత్స అందించారు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై ఎంబడి శ్రీకాంత్ నలుగురు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గురుకులాల్లో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm