జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
Views :0

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
నేటి చర్చ : ఆంధ్రప్రదేశ్,ఆమరావతి,నవంబర్ 22,
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కమెడియ న్లు రైజింగ్ రాజు, దొరబాబు,లకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది, శనివారం రాత్రి ఒక ఈవెంట్ కార్యక్రమం లో పాల్గొనడానికి రైజింగ్ రాజు, దొరబాబు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడా అగ్రహారం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రత కు కారు ముందు భాగం నుజ్జునుజ్జ యింది.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడిన రైజింగ్ రాజు, దొరబాబుల ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసు పత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో అభిమానులు, తోటి కళాకారులు, ఈవెం ట్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నా రు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తు న్నారు. 'జబర్దస్త్' స్కిట్లతో నవ్వులు పంచుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకు న్న రైజింగ్ రాజు, దొరబాబు త్వరగా కోలుక
