గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.
నేటి చర్చ : గుజరాత్,నవంబర్ 22, గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, కచ్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయా రు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
భుజ్-ఖావ్డా జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపా రు. వివరాల్లోకి వెళ్తే.. కచ్ జిల్లాలోని వెకారియా రణ్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అంతేకాకుండా పల్టీలు కొట్టడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది.
ప్రమాద తీవ్రత కారణంగా ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది మృతుల్లో ముగ్గురు చిన్నారు లు ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఉన్న ట్లు తెలుస్తోంది.
