డిసెంబర్ 4న తిరుపతికి ప్రధాని నరేంద్ర మోదీ.

Views :0
డిసెంబర్ 4న తిరుపతికి ప్రధాని నరేంద్ర మోదీ.
Prime Minister Narendra Modi

డిసెంబర్ 4న తిరుపతికి ప్రధాని నరేంద్ర మోదీ.

నేటి చర్చ : తిరుపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 4న తిరుపతిలో పర్యటించే అవకాశం ఉంది. తిరుపతిలో డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న అఖిల భారత డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి సదస్సుకు ప్రధాని హాజరుకానున్నట్లు సమాచారం.

ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అంతర్గత భద్రత, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

*ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష:*

ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రధాని భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు.వసతి, రవాణా సౌకర్యాల కల్పన.

తిరుపతి నగరంలో రోడ్ల సుందరీకరణ.విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాటు.

సదస్సు జరిగే ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన.

సదస్సు నిర్వహణకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Latest News

Read More...
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.

23-11-2026 11:50 pm

జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.
జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.

23-11-2026 11:13 pm

ఒక కుట్రలో భాగంగా, వారు రైలు పట్టాలపై లావుపాటి విద్యుత్ కేబుళ్ల కట్టను ఉంచారు.
ఒక కుట్రలో భాగంగా, వారు రైలు పట్టాలపై లావుపాటి విద్యుత్ కేబుళ్ల కట్టను ఉంచారు.

23-11-2026 11:04 pm

గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.
గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.

23-11-2026 09:49 pm

మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.
మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.

23-11-2026 09:42 pm