మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.

మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సత్తా చాటిన విద్యార్థుల.
నేటి చర్చ : కొత్తగూడెం, 23 నవంబర్, హైదరాబాద్‌లోని బాయ్స్ టౌన్ పాఠశాలలో నిర్వహించిన మాంట్‌ఫోర్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ – 2026 జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొన్న విద్యార్థులు ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
జూనియర్ బాలికల జావెలిన్ త్రో విభాగంలో పి. ఉపాసన స్వర్ణ పతకం, సీనియర్ బాలుర 100 మీటర్ల పరుగులో ఎస్కె. అర్హాన్ అలీ రజత పతకం సాధించారు.
సీనియర్ బాలుర 200 మీటర్ల పరుగులో బి. మనీశ్వర్, జూనియర్ బాలుర 200 మీటర్ల పరుగులో పి. వినీత్ కుమార్, సీనియర్ బాలికల డిస్కస్ త్రోలో ఎస్. శ్రీ గాయత్రి కాంస్య పతకాలు సాధించారు.
అదేవిధంగా సీనియర్ బాలికల ఖో-ఖో జట్టు, 4×100 మీటర్ల రిలే జట్టు కాంస్య పతకాలు సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచాయి.
ఇక మార్చ్‌పాస్ట్ విభాగంలో పాఠశాల జట్టు మూడో స్థానం సాధించింది.
షటిల్ బ్యాడ్మింటన్‌లో ఐ. యశ్వంత్, ఎస్. తేజ, పి. రాబిన్ జాషువా, ఎం.డి. తల్హా నాలుగో స్థానంలో నిలిచారు.
జూనియర్ బాలికల 4×100 మీటర్ల రిలే పోటీలో పి. ఉపాసన, పి. జాహ్నవి, వి. శ్రేష్ఠ, ఎన్. అక్షయ జయన్ నాలుగో స్థానం సాధించారు.
అలాగే జూనియర్ బాలికల 100 మీటర్ల పరుగులో పి. ఉపాసన నాలుగో స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థుల విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, వారి క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన, క్రీడాస్ఫూర్తిని అభినందించింది.
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు, తల్లిదండ్రులకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.
విద్యార్థుల విజయాల వెనుక కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు,సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
