జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.

Views :0
జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.

జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.

రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం.

పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి*l.

నేటి చర్చ : పెద్దపల్లి జిల్లా, 23 నవంబర్, గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలోని శివాలయం సమీపంలో 23-11-2026 తెల్లవారుజామున జరిగిన హత్య కేసును గోదావరిఖని 1 టౌన్ పోలీసులు అత్యంత వేగంగా దర్యాప్తు చేసి,హత్య జరిగిన 12 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారు.పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి తెలిపారు.హత్యకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే గోదావరిఖని 1 టౌన్ ఇన్‌చార్జ్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి,పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆధారాలను సేకరించారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా,ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచనలతో, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని 1 టౌన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో ఎస్సైలు మనోహర్, రాజశేఖర్‌లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు చేపట్టిన వేగవంతమైన దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం సేకరించి, నిందితులు పారిపోతున్న మార్గాలను గుర్తించారు. అనంతరం 5 ఇంక్లైన్ చౌరస్తా సమీపంలో నేరానికి ఉపయోగించిన ఆటోలో వెళ్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం నిందితులను గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.


వివరాల్లోకి వెళితే...


మృతుడు అట్ల రాజశేఖర్ తండ్రి అట్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.

ఫిర్యాదు ప్రకారం, అట్ల రాజశేఖర్ 22-11-2026 రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 23-11-2026 తెల్లవారుజామున అతను హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.పాత కక్షలు,వ్యక్తిగత విభేదాలను మనసులో పెట్టుకుని ఎన్నం ప్రసాద్, ఎడ్లపల్లి శ్రావణ్ కుమార్,అయిలీ దేవేందర్,బోరె మల్లేష్‌లు తన కుమారుడిని హత్య చేసేందుకు కుట్ర పన్ని,కత్తులతో దాడి చేసి హత్య చేశారని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు దారితీసిన నేపథ్యం

ప్రధాన నిందితుడు ఎన్నం ప్రసాద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అట్ల రాజశేఖర్‌తో అతనికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.అయితే గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఏర్పడ్డాయి.ఫోన్‌లో జరిగిన వాగ్వాదాలు, పరస్పర దూషణలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలతో ప్రసాద్ రాజశేఖర్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో రాజశేఖర్‌ను హత్య చేయాలని ప్రసాద్ నిర్ణయించుకుని, తన స్నేహితులైన ఎడ్లపల్లి శ్రావణ్ కుమార్, అయిలీ దేవేందర్, బోరె మల్లేష్‌లకు విషయం తెలిపాడు.వారితో కలిసి హత్యకు పథకం రచించాడు.

పథకం ప్రకారం ప్రసాద్ ముందుగానే ఒక పెద్ద కత్తిని కొనుగోలు చేసి తన ఆటోలో ఉంచుకున్నాడు. మరో నిందితుడు అయిలీ దేవేందర్ కూడా ఒక చిన్న కత్తిని వెంట తెచ్చుకున్నాడు.

22-11-2026 సాయంత్రం రాజశేఖర్‌తో ఫోన్‌లో వాగ్వాదం జరిగిన అనంతరం నలుగురు నిందితులు ప్రసాద్‌కు చెందిన ఆటోలో బృందావన్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పవర్‌హౌస్ కాలనీలోని బాలయ్య కిరాణా దుకాణం ఎదురుగా ఉన్న రోడ్డుపై రాజశేఖర్ కోసం మాటువేశారు.

23-11-2026 తెల్లవారుజామున సుమారు 1:10 గంటల సమయంలో రాజశేఖర్ తన ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి ఇంటికి వెళ్తుండగా నిందితులు అతడిని అడ్డగించారు. అనంతరం నిందితులు కత్తులతో మూకుమ్మడిగా దాడి చేయడంతో రాజశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య అనంతరం నిందితుల పరారీ ప్రయత్నం

హత్య అనంతరం నిందితులు రక్తపు మరకలు ఉన్న దుస్తులను తొలగించి కాల్చివేశారు. అనంతరం ఆ దుస్తుల బూడిదను గోదావరిలో పడవేసి, పోలీసులకు చిక్కకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులు సేకరించిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి, వారు కాల్వ శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

1. నేరానికి ఉపయోగించిన పసుపు రంగు ఆటో — నంబర్: TG-22-T-2866.

2. హత్యకు ఉపయోగించిన పెద్ద కత్తి.

3. హత్యకు ఉపయోగించిన చిన్న కత్తి.

4. నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు.

5. రక్తపు మరకలు ఉన్న టీ షర్టు.


రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు

ఈ సందర్భంగా డీసీపీ బి.రామ్ రెడ్డి మాట్లాడుతూ, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు.ప్రజల ప్రశాంతమైన జీవనానికి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.

నేరస్తులు ఎంతటి ప్రణాళికతో నేరానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోలేరని, ముఖ్యంగా హత్య వంటి తీవ్రమైన నేరాల పట్ల పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రజలు వ్యక్తిగత కక్షలు,కుటుంబ లేదా ఇతర వివాదాలను హింసాత్మకంగా పరిష్కరించుకోకుండా, చట్టపరమైన మార్గాలను అనుసరించాలని డీసీపీ సూచించారు. ఏవైనా వివాదాలు ఉంటే పోలీసులను ఆశ్రయించి సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని కోరారు.

హత్య జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి, వేగవంతమైన దర్యాప్తుతో నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసు బృందాన్ని డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ అభినందించారు.

నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ లింగమూర్తి,ఎస్సైలు మనోహర్, రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ సదయ్య, కానిస్టేబుళ్లు బి. ప్రకాష్, ఐ. రమేష్, మధుకర్, మధుసూదన్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

Latest News

Read More...
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.

23-11-2026 11:50 pm

జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.
జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.

23-11-2026 11:13 pm

ఒక కుట్రలో భాగంగా, వారు రైలు పట్టాలపై లావుపాటి విద్యుత్ కేబుళ్ల కట్టను ఉంచారు.
ఒక కుట్రలో భాగంగా, వారు రైలు పట్టాలపై లావుపాటి విద్యుత్ కేబుళ్ల కట్టను ఉంచారు.

23-11-2026 11:04 pm

గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.
గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.

23-11-2026 09:49 pm

మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.
మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.

23-11-2026 09:42 pm