సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను-పిచ్చేటి శివ కుమార్ (హైట్ శివ).

Views :0
సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను-పిచ్చేటి శివ కుమార్ (హైట్ శివ).

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రుద్రంపూర్,18 నవంబర్, కొత్తగూడెం ఏరియా సింగరేణి కార్మిక సోదరులకు మరియు కాంటాక్ట్ కార్మిక సోదరులకు విప్లవ వందనాలు.

సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను.

పేచీట్టి శివ కుమార్ @ హైట్ శివ, నేను 2016 నుండి 2020 వరకు ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ సొసైటీలో జీకే ఓసి లో కార్మికుల హక్కుల కోసం అనేకమైన పోరాటాలు వారి జీతభత్యాలు, పనిగంటలు అనేకమైన అంశాలపై కార్మికుల పట్ల చిత్తశుద్ధితో ఐదు సంవత్సరాలు కార్మికుల కోసం నిత్యం పోరాటం చేయడం జరిగింది. రుద్రంపూర్ లో కొత్తగూడెం ఏరియా సిపిఎం ఆఫీసులో సిపిఎం పార్టీ అనుబంధ కార్మిక సంఘం సీఐటీయూ లో 2026 ఏప్రిల్ మాసంలో నేను నాతోపాటు సుమారుగా 50 మంది సింగరేణి డిఎల్ఆర్ కార్మికులతో సీఐటీయూ కార్మిక సంఘంలో చేరడం జరిగింది ఇంతటితో నా ప్రయాణాన్ని ముగించకుండా మరిన్ని చేరికలు సుమారుగా 70 మందితో సీఐటీయూ కార్మిక సంఘంలో కొనసాగుతున్నాను నా అంకిత భావాన్ని చిత్తశుద్ధిని నా పనితీరుని నచ్చి సీఐటీయూ అగ్ర నాయకత్వం నాకు కొత్తగూడెం ఏరియా డిఎల్ఆర్ కాంట్రాక్టు కార్మికులకు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ క్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపుమేరకు జైల్ బరో కార్యక్రమాన్ని నేను నా తోటి కార్మికులు సీఐటీయూ పక్షాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరిన్ని కార్యక్రమాలు కొత్తగూడెం ఏరియా డి ఎల్ ఆర్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేకసార్లు గేట్ మీటింగ్లు పెట్టి వాటిని పరిష్కరించే విధంగా పోరాటం చేయడం జరిగింది అంతేకాకుండా హైదరాబాద్ ఇందిరా గాంధీ పార్క్ వద్ద సీఐటీయూ కార్మిక సంఘం తెలంగాణ వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం మల్టిపుల్ డేస్ ఈ కార్యక్రమంలో సీఐటీయూ పిలుపుమేరకు కొత్తగూడెం ఏరియా నుండి నేను బాధ్యతలు తీసుకొని సుమారుగా 16 మంది కార్మికులని తీసుకొని వెళ్లి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి అంతే కాకుండా మొన్నటికి మొన్న జరిగినటువంటి టీజీ ఆర్టీసీ ఎన్నికల్లో కొత్తగూడెం డిపోలో నేను నా తోటి కార్మికులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ తొమ్మిది నెలల కాలవ్యవధిలో అనేకమైన పోరాటాలు అనేకమైన ఉద్యమాలు అనేకమైన కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో అంకితభావంతో సిఐటియు కార్మిక వర్గం పట్ల పనిచేయడం జరిగింది ఈ క్రమంలో 11/11/2026 నుండి అఖిలపక్ష కార్మిక జేఏసీ వీకేసిఏం శోద కంపెనీ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ క్రమంలో కొత్తగూడెం వీకేసీఏం ఆఫ్ లోడింగ్ కార్మికుల పక్షాన సీఐటీయూ కార్మిక సంఘం అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అల్లి నాగయ్య గారు మరియు ప్రమోద్ గారు వారిని కాదని వీకేసీఏం ఆఫ్ లోడింగ్ లో ఎటువంటి యూనియన్ కార్యకలాపాలు నిర్వహించని వారికి చెప్పడం జరిగింది అయినప్పటికీ గత పది రోజులుగా ఇతర కార్మిక సంఘాలు హైట్ శివ ని పిలిపించండి టెంట్లో కూర్చోపెట్టండి అని నాపై ఒత్తిడి తీసుకొస్తూ, సీఐటీయూ బాద్యుడిగా ఉన్న అల్లి నాగయ్య గారిపై ప్రమోద్ గారిపై ఒత్తిడికి గురి చేస్తూ నాపై అనేకమైన దుష్ప్రచారాలు చేస్తూ జిరాక్స్ పేపర్లు తీసుకెళ్తున్నాడు, వొల్వో డ్రైవర్లని జాయిన్ చేస్తున్నాడు బండ్లు తిప్పే విధంగా ప్రయత్నిస్తున్నాడని నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు వీకేసీఏం శోద కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నేను ఎటువంటి విధులు నిర్వహించడం లేదు నాకు అక్కడ ఎటువంటి ఎంప్లాయిమెంట్ నెంబర్ లేదు అదే అఖిలపక్ష కార్మిక సంఘాలు నా పట్ల నా ఉద్యోగం పట్ల ఏనాడు ఎప్పుడు శోద యాజమాన్యంతో మాట్లాడింది లేకపోగా ఇదే అఖిలపక్ష జేఏసీ కార్మిక సంఘాలు శోద యాజమాన్యానికి అనేకమైన ఆరోపణలు అవాస్తవాలు నాపై చెప్పడం కూడా జరిగింది కావున నన్ను నమ్ముకొని ఉన్న నాతోటి పాత కార్మికులు ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులు ఈరోజు నుంచి ఎటువంటి యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనరని ఏ ఒక్క కార్మిక సంఘంతో మాకు సంబంధాలు ఉండవని నేను కొత్తగూడెం ఏరియా సిఐటియు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి తక్షణమే వైదొలుగుతున్నానని ప్రకటిస్తున్నాను - పిచ్చేట్టిశివ కుమార్ @ హైట్ శివ.

Latest News

Read More...
సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను-పిచ్చేటి శివ కుమార్ (హైట్ శివ).
సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను-పిచ్చేటి శివ కుమార్ (హైట్ శివ).

18-11-2026 09:55 pm

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం.

18-11-2026 09:43 pm

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా.

18-11-2026 08:43 pm

ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా మోదుగడ్డ తండా సర్పంచ్.
ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా మోదుగడ్డ తండా సర్పంచ్.

18-11-2026 08:34 pm

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.

18-11-2026 01:42 pm