లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.

Views :0
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.

రూ.1.50 లక్షలు స్వీకరిస్తుండగా పట్టుకున్న కరీంనగర్‌ ఏసీబీ అధికారులు.. కూనారం రోడ్డులోని నివాసంలో దాడి.

నేటి చర్చ,పెద్దపల్లి, నవంబర్‌ 18,

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడులు కలకలం రేపాయి. ఓ కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించి లబ్ధి చేకూరుస్తానంటూ లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) డొంకెన రవీందర్‌ రూ.1.50 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో భూవివాదం నేపథ్యంలో 2023లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు పెద్దపల్లి కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసులోని ఓ నిందితుడికి అనుకూలంగా వ్యవహరించి లబ్ధి చేకూరుస్తానని పీపీ రవీందర్‌ రూ.2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. చివరకు రూ.1.50 లక్షలు తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

పీపీ లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు కరీంనగర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన కరీంనగర్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం బుధవారం పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో ఉన్న రవీందర్‌ నివాసంపై దాడి చేసింది. అక్కడ లంచం సొమ్ము స్వీకరిస్తున్న సమయంలో ఆయనను పట్టుకున్నట్లు సమాచారం.

అనంతరం ఏసీబీ అధికారులు ఫినాఫ్తలీన్‌ పరీక్ష నిర్వహించి, పలువురి వాంగ్మూలాలను సేకరించారు. తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా రవీందర్‌ను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తరలించారు. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లంచం ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడటం జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Latest News

Read More...
సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను-పిచ్చేటి శివ కుమార్ (హైట్ శివ).
సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను-పిచ్చేటి శివ కుమార్ (హైట్ శివ).

18-11-2026 09:55 pm

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం.

18-11-2026 09:43 pm

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా.

18-11-2026 08:43 pm

ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా మోదుగడ్డ తండా సర్పంచ్.
ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా మోదుగడ్డ తండా సర్పంచ్.

18-11-2026 08:34 pm

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.

18-11-2026 01:42 pm