ప్రముఖ సినీ నటుడు గిరిబాబు కన్నుమూత.

ప్రముఖ సినీ నటుడు గిరిబాబు కన్నుమూత.
నేటి చర్చ : హైదరాబాద్,14 నవంబర్, తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) శనివారం నవంబర్ 14, 2026 నాడు కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
600కు పైగా సినిమాల్లో నటించారు.
'అతడు', 'ఖడ్గం', 'గీత గోవిందం', 'జాతిరత్నాలు' తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
ఆయన కుమారుడు రఘుబాబు కూడా ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు.
గిరిబాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప సీనియర్ నటుడిని కోల్పోయింది.
