ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త.. తెలంగాణలో 23 ఫార్మసీలపై సస్పెన్షన్ వేటు.

ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త.. తెలంగాణలో 23 ఫార్మసీలపై సస్పెన్షన్ వేటు.
నేటి చర్చ : హైదరాబాద్, 17 నవంబర్, ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే ఫార్మసీలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ సంస్థలతో అనుసంధానమైన 23 మెడికల్ షాపులను అధికారులు సస్పెండ్ చేశారు. మరో 9 ఫార్మసీలకు హెచ్చరికలు జారీ చేశారు.
అక్టోబర్ 28న నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940 నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు.
ఈ సంస్థలతో అనుబంధంగా ఉన్న ఫార్మసీల్లో తనిఖీలు
Tata 1mg, Netmeds, Zepto, Apollo 24/7, MedPlus Mart, Instamart తదితర సంస్థలతో అనుసంధానమైన మెడికల్ షాపులను అధికారులు తనిఖీ చేశారు.
సస్పెన్షన్ వివరాలు:
15 ఫార్మసీలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెండ్ చేశారు.
8 ఫార్మసీలపై నిర్ణీత కాలానికి సస్పెన్షన్ విధించారు.
మరో 9 ఫార్మసీలకు హెచ్చరికలు జారీ చేశారు.
మందుల విక్రయాలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా పాటిస్తున్నారా? రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ ఉందా? మందుల విక్రయాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అనే అంశాలను అధికారులు పరిశీలించారు.
ఆన్‌లైన్‌లో అక్రమంగా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే TG SAFE టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదుల సమయం: పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు.
మందుల కొనుగోలులో నిర్లక్ష్యం వద్దు.. ప్రిస్క్రిప్షన్ నిబంధనలు పాటించే విశ్వసనీయ ఫార్మసీల నుంచే మందులు కొనుగోలు చేయండి.
