హైదరాబాద్‌లో ఆహార భద్రతపై భారీ దాడులు14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్.

Views :0
హైదరాబాద్‌లో ఆహార భద్రతపై భారీ దాడులు14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్.
Frozen chicken with fungus

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై భారీ దాడులు 14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్.

నేటి చర్చ : హైదరాబాద్, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్లు రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత ఆహార పదార్థాలు, పురుగులు కనిపించడంతో అధికారులు 14 హోటళ్ల లైసెన్సులను సస్పెండ్ చేసి తక్షణమే మూసివేయాలని ఆదేశించారు.

మూసివేతకు ఆదేశించిన 14 హోటళ్లు:

1. షా ఘౌస్ కేఫ్ – షాలిబండ

2. హోటల్ నయాబ్ – నయాపూల్

3. లక్కీ రెస్టారెంట్ – సంతోష్ నగర్

4. మెహఫిల్ రెస్టారెంట్ – దిల్‌సుఖ్‌నగర్

5. సిద్ధిఖీ కబాబ్ సెంట్రల్ కిచెన్ – గుడిమల్కాపూర్

6. అల్ సబా హోటల్ – టోలిచౌకి

7. డైన్ హిల్ రెస్టారెంట్ – మాసబ్ ట్యాంక్

8. సోహైల్ రెస్టారెంట్ – మలక్‌పేట్

9. అక్షయ టిఫిన్స్ – మలక్‌పేట్

10. అజీబో రెస్టారెంట్ – రెతిబౌలి

11. శ్రీ బాలాజీ ఫ్యామిలీ ధాబా – గుడిమల్కాపూర్

12. శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ – టోలిచౌకి

13. శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ – సంతోష్ నగర్

14. హోటల్ వెంకటేశ్వర – MJR రోడ్

తనిఖీల్లో అధికారులకు కనిపించిన దారుణమైన పరిస్థితులు:

వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల మలవిసర్జన, ఈగలు.

కుళ్లిపోయిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఫంగస్ పట్టిన పదార్థాలు.

మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోవడం.

రిఫ్రిజిరేటర్లలో రక్తం పేరుకుపోయేలా మాంసాన్ని అపరిశుభ్రంగా నిల్వ చేయడం.

పదేపదే వాడిన వంట నూనెతో ఆహార తయారీ.

అజీబో రెస్టారెంట్‌లో తాగునీటి నిల్వ ట్యాంకులోనే బొద్దింకలు కనిపించడం!

అధికారులు తీసుకున్న చర్యలు:

🔹 14 ఆహార వ్యాపార లైసెన్సులు సస్పెండ్.

🔹 తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, పిస్తా హౌస్, గోల్కొండ హోటల్ సహా మరో 8 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ.

🔹 544 కిలోల కలుషిత, పాడైపోయిన ఆహార పదార్థాలు ధ్వంసం.

🔹 13 కిలోల వాడిన వంట నూనె పారవేత.

🔹 కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాల సేకరణ.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?

హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి ఆహారం తీసుకునే వినియోగదారులకు కనీస పరిశుభ్రత, నాణ్యతపై నమ్మకం ఉండాలి. ప్రముఖ హోటళ్లలోనే ఇలాంటి పరిస్థితులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

కేవలం తనిఖీలు చేసి జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తిరిగి ప్రారంభించే ముందు ఆహార భద్రతా ప్రమాణాలు పూర్తిగా పాటిస్తున్నాయో లేదో నిర్ధారించాలి.

హైదరాబాద్ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం.. వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే పరిస్థితులకు తావుండకూడదు!

బయటకు వెళ్ళి ఏమి తింటున్నారో చూసుకోండి, ముఖ్యముగా ఈ మాంసాహారంలో ఫంగస్ కలిస్తే తొందరగా విపరీత ఫలితాలు వస్తాయి. ప్రజలు వీక్ ఎండ్ వస్తె అబ అబ గా హోటల్ ల వైపు పరిగెడతారు. వెళ్ళి మరీ ఇది బొమిక, ఇది లెగ్ పీస్ , ఇది తలకాయ అంటూ వర్ణించుకుంటూ , ఆస్వాదించుకుంటూ తింటారు, వెనక ఏముందో చూడరు.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.
నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm