నర్సింగ్ రంగంలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం - సేవాభారతి కొత్తగూడెం బాధ్యులు, న్యాయవాది పాండురంగ విఠల్ తెలిపారు.

నర్సింగ్ రంగంలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం - సేవాభారతి కొత్తగూడెం బాధ్యులు, న్యాయవాది పాండురంగ విఠల్ తెలిపారు.
నేటి చర్చ : కొత్తగూడెం: సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (GDA) కోర్సులో 33వ బ్యాచ్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సేవాభారతి కొత్తగూడెం బాధ్యులు, న్యాయవాది పాండురంగ విఠల్ తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన యువతకు నర్సింగ్, పేషెంట్ కేర్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నాలుగు నెలల పాటు కొనసాగే ఈ కోర్సులో పేషెంట్ కేర్, ప్రాథమిక వైద్య సహాయం, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ఆసుపత్రులు, హెల్త్ కేర్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం సహకారం అందించనున్నట్లు వివరించారు.
పదో తరగతి ఉత్తీర్ణులై, 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు కోర్సు పూర్తి చేసిన వారికి HSSC సర్టిఫికెట్ అందజేస్తారని పేర్కొన్నారు.
ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాది పాండురంగ విఠల్ కోరారు.
మరిన్ని వివరాలకు హైదరాబాద్‌లోని న్యూ బోయినపల్లి సేవాభారతి కార్యాలయాన్ని లేదా 9398312414, 9704387050 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
