భార్యను కుర్చీకి కట్టేసి,నిప్పంటించి హత్య చేసిన భర్త.

భార్యను కుర్చీకి కట్టేసి,నిప్పంటించి హత్య చేసిన భర్త.
నేటి చర్చ : ఉత్తరప్రదేశ్, కన్నౌజ్ జిల్లా, చిబ్రమౌ పీఎస్ పరిధిలోని జగత్‌పూర్ గ్రామంలో దారుణ ఘటన
11 ఏళ్ల క్రితం సుఖ్బీర్ సింగ్ అలియాస్ మోను(35), సోనమ్‌లకు పెళ్లి.. వీరికి ఇద్దరు పిల్లలు
మోను హర్యానాలోని హిసార్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు
భార్య సోనమ్ జగత్‌పూర్ గ్రామంలోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది
ఇటీవల మోను గ్రామానికి తిరిగి రాగా.. భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు
దాంతో సోనమ్ వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని మోను అనుమానం పెంచుకున్నాడు
ఇదే విషయమై ఇద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి తరచూ గొడవలు జరుగుతున్నాయి
ఈ క్రమంలోనే.. మోను తీవ్ర కోపాద్రిక్తుడై సోనమ్‌ను కుర్చీకి కట్టేసి, ఆమెకు నిప్పింటించాడు
అనంతరం.. తన ఇద్దరు పిల్లలను తీసుకొని, ఘటనా స్థలం నుంచి మోను వెళ్లిపోయాడు
స్థానికుల సమాచారంతో.. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి, మంటలను అదుపు చేశారు
మంటలను ఆర్పేందుకు.. తమకు గంటన్నర సమయం పట్టిందని తెలిపిన అధికారులు
ఈ ఘటనలో సోనమ్ పూర్తిగా కాలిపోయి.. కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయని సమాచారం
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసు
