తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముఖ్యాంశాలు

నేటి చర్చ : హైదరాబాద్, తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముఖ్యాంశాలు
1.ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి:
- రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం.
2. కొడంగల్ రైతు సభ: నవంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ రైతు బహిరంగ సభ.
3. ఇందిరమ్మ చీరల పంపిణీ: నవంబర్ 19న సిద్దిపేటలో ప్రారంభం.
4. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం ప్రారంభం.
5. దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 20–30 వరకు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుల సేకరణ.
6. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు: ఉమ్మడి కమిషన్ రద్దు చేసి ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు. ఒక్కో కమిషన్‌లో చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులు.
7. ఫైర్ సర్వీస్ చట్టం: తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్–1999 సవరణకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం.
8. సర్వే చట్టం సవరణ: సర్వే, సరిహద్దుల నోటీసులపై అప్పీల్ గడువు 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గింపు ప్రతిపాదనకు ఆమోదం.
9. న్యాయస్థానాల్లో ఉద్యోగాలు: వివిధ కోర్టులకు మొత్తం 136 పోస్టుల మంజూరుకు ఆమోదం.
