బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య

బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య. కుట్ర,ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య రూ.18 లక్షలే లక్ష్యంగా దారుణం.
నేటి చర్చ : మహబూబ్‌నగర్ జిల్లా,25 నవంబర్, జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన మల్లికార్జున్ (23) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెండు నెలల క్రితం శ్రీశైలం బస్సు ప్రయాణంలో మల్లికార్జున్‌కు శివ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా మల్లికార్జున్ భార్య అంజమ్మతో వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం.
ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారంగా మల్లికార్జున్ కుటుంబానికి వచ్చిన రూ.18 లక్షలపై శివ, అంజమ్మ కన్నేసినట్లు తెలుస్తోంది. భర్తను హత్య చేసి ఆ డబ్బును చెరిసగం పంచుకోవాలని ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఈ నెల 20న కూలి పని ఉందంటూ మల్లికార్జున్‌ను పిలిపించిన శివ.. అతడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట వద్ద మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
డబ్బు ఆశ.. అక్రమ సంబంధం.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
