మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!
Views :0

మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు.
నేటి చర్చ : అశ్వాపురం, 25 నవంబర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టి సమీపంలోని వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? ప్రమాదానికి అతివేగమా లేక డ్రైవర్ నిద్రమత్తా కారణమా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
