ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.
Views :0

ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.
నేటి చర్చ : హైదరాబాద్, 25 నవంబర్, సోషల్ మీడియాలో కత్తులు ప్రదర్శిస్తూ, రౌడీయిజాన్ని ప్రోత్సహించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్టు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రఘునాథపాలెం ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడి వద్ద నుంచి మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, అతనికి సంబంధించిన గత నేర చరిత్రపై కూడా విచారణ చేపట్టారు.
సోషల్ మీడియాలో ఆయుధాలను ప్రదర్శిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం.
