పోలీస్ శాఖలో కలకలం, అడ్డంగా దొరికిపోయిన యంగ్ లేడీ ఎస్ఐ.

Views :0
పోలీస్ శాఖలో కలకలం, అడ్డంగా దొరికిపోయిన యంగ్ లేడీ ఎస్ఐ.

పోలీస్ శాఖలో కలకలం, అడ్డంగా దొరికిపోయిన యంగ్ లేడీ ఎస్ఐ.

నేటి చర్చ : కుల్సుంపుర సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ కీలక ఠాణాలో అవినీతి ఆరోపణలపై 2024 బ్యాచ్‌ మహిళా ఎస్సైపై వేటు పడింది. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆధారాలతో నిలదీసిన సీపీ సజ్జనార్‌ ఆమెను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన ఓ యువ మహిళా ఎస్సై, బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే అవినీతికి తెరలేపి ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కుల్సుంపుర సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ కీలక ఠాణాలో విధులు నిర్వహిస్తున్న 2024 బ్యాచ్‌కు చెందిన మహిళా ఎస్సైపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రొబేషనరీ కాలం సైతం పూర్తికాకముందే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీసీలోనే ఆధారాలతో నిలదీత..

ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ)లో సదరు మహిళా ఎస్సై వ్యవహార శైలిపై సీపీ సజ్జనార్‌ కీలక ఆధారాలను ప్రస్తావించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి వసూళ్లు, సివిల్‌ తగాదాల్లో తలదూర్చడం వంటి అంశాలపై పక్కా సమాచారంతో ఆమెను నిలదీసినట్లు తెలిసింది. విధుల్లో చేరిన స్వల్ప వ్యవధిలోనే ‘టీ20’ తరహాలో వేగంగా అవినీతికి పాల్పడటంపై సీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను ప్రస్తుత పోలీసు స్టేషన్‌ విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించడంతో, అధికారులు ఆమెను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

కానిస్టేబుళ్లపైనా వేటుకు రంగం సిద్ధం..

ఈ అవినీతి వ్యవహారంలో మహిళా ఎస్సైకి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు సిబ్బందిపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో ఒక ఏఆర్‌ కానిస్టేబుల్‌తో పాటు మరొక సివిల్‌ కానిస్టేబుల్‌ పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరిద్దరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. శిక్షణ పూర్తి చేసుకుని ఉత్సాహంగా విధుల్లోకి రావాల్సిన 2024 బ్యాచ్‌ అధికారిణి, ఆదిలోనే అవినీతి మరక అంటించుకుని వేటుకు గురికావడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Latest News

Read More...
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.

25-11-2026 10:33 pm

స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.
స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.

25-11-2026 10:22 pm

బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య
బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య

25-11-2026 09:12 pm

మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!
మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!

25-11-2026 08:56 pm

చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm