ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు,ప్రయాణికుల్లో ఆందోళన,అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపడంతో తప్పిన ప్రమాదం.

ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు,ప్రయాణికుల్లో ఆందోళన,అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపడంతో తప్పిన ప్రమాదం.
నేటి చర్చ : రంగారెడ్డి జిల్లా,19 నవంబర్, షాద్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌కు బయలుదేరిన బస్సు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫరూఖ్‌నగర్ సమీపంలోని ఏ1 ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోగానే పొగలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమికంగా సాంకేతిక కారణాలతోనే బస్సులో పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు..
