వరంగల్ ఖుర్షీద్ హోటల్ పై ఆహార భద్రత అధికారుల దాడి.

Views :0
వరంగల్ ఖుర్షీద్ హోటల్ పై ఆహార భద్రత అధికారుల దాడి.
Warangal Kurshid Hotel kitchen

ఖుర్షీద్ హోటల్ పై ఆహార భద్రత అధికారుల దాడి.

మండి బజార్‌లో ఖుర్షీద్ బిర్యానీ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.

నేటి చర్చ : వరంగల్, మండి బజార్‌లోని *ఖుర్షీద్ బిర్యానీ హోటల్‌లో* ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.

మంగళవారం టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్, సగం ఉడికించిన చికెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ బయటపడ్డాయి. ఆహార పదార్థాలను మూతలు లేకుండా ఉంచడంతో పాటు వంటగదిలో బొద్దింకలు, గోడలకు బూజు, అపరిశుభ్రమైన నేలను అధికారులు గుర్తించారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ ప్రదర్శించకపోవడం, సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు అందుబాటులో లేకపోవడం సహా మొత్తం 12 రకాల ఉల్లంఘనలు గుర్తించారు. సంబంధిత హోటల్ యజమానిపై ఆహార భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు.

హోటల్‌లో బిర్యానీ తినే ప్రియులారా.. ఆహారం తయారవుతున్న వాతావరణం కూడా ఒక్కసారి ఆలోచించాలి అని ప్రజలు అంటున్నారు.

Latest News

Read More...
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.

25-11-2026 10:33 pm

స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.
స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.

25-11-2026 10:22 pm

బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య
బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య

25-11-2026 09:12 pm

మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!
మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!

25-11-2026 08:56 pm

చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm