పేదలకు ఇచ్చే పింఛన్ కార్యక్రమాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే.

Views :0
పేదలకు ఇచ్చే పింఛన్ కార్యక్రమాన్ని అడ్డుకున్న  ఎమ్మెల్యే.

పేదలకు ఇచ్చే పింఛన్ కార్యక్రమాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే.

ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తాం.

సుధీర్ రెడ్డికి మధుయాష్కి గౌడ్ మాస్ వార్నింగ్.

ఫించన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్ .

నేటి చర్చ , ఎల్బీనగర్, నవంబర్ 19:

రౌడీ మూకలను తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే. ఎవరూ చేతులు ముడుచుకొని కూర్చోలేదని.. తొక్కుకుంటూ వెళ్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాజీ ఎంపీ, ఏఐపీసీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ హెచ్చరించారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో నూతనంగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం చంపాపేటలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.

శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్టణం మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కాగా, మధుయాష్కి గౌడ్, జోనల్ కమిషనర్ వికాస్ మహ తో గారు హాజరై పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని, రంగారెడ్డి జిల్లాలో 33 వేల మందికి పించర్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెమట చుక్కలు చిందిస్తే గెలిచిన సుధీర్ రెడ్డి కార్యకర్తల మోసం చేసి పార్టీ మారాడన్నారు. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛను పత్రాలు పొందకుండా.. రౌడీ మూకలతో సుధీర్ రెడ్డి అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటు అన్నారు. ' ప్రోటోకాల్ అని మాట్లాడుతున్నావు.. మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు ఇవి .. మేమంతా బరాబర్ వస్తాం.. ప్రజల కోసం పనిచేస్తాం.. నీ దర్కార్ గిరి ఇక్కడ నడవదు. సుధీర్ రెడ్డి నీవు దర్కార్ గిరి చేస్తానంటే బుద్ధి చెప్పేందుకు మా మహేందర్ రెడ్డి ఒక్కడు చాలు.. '' అని మధుయాష్కి గౌడ్ హెచ్చరించారు.

మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం. సుధీర్ రెడ్డి లాగా భూ కబ్జాలకు, దందాలు చేయటం లేదని పేర్కొన్నారు. అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అత్తమామల పేరిట అక్రమంగా ఆరోగ్యశ్రీ డబ్బులు పొందిన చరిత్ర సుధీర్ రెడ్డిది అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి సహనంతో ఉన్నామని, మా సహనాన్ని అలుసుగా తీసుకుంటే మా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తొక్కుకుంటూ ముందుకెళ్తామన్నారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాలలో కలిసివస్తే సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అడ్డుకోవాలని చూస్తే తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎంపీ గా ఉన్న రేవంత్ రెడ్డిని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కనీసం గాంధీ భవన్ కూడా దాటనీయకుండా పోలీసులతో అడ్డుకున్నారన్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో నూతనంగా 3600 మందికి పింఛన్లు మంజూరయ్యాయని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ గృహాలు, సన్నబియ్యం, ఉచిత బస్సు సదుపాయం తదితర పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా రేపు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

రౌడీ మూకలతో సుధీర్ రెడ్డి వ్యవహరించిన తీరుతో పింఛను పత్రాలు పొందేందుకు వచ్చిన మహిళలు, వికలాంగులు, వితంతువులు .. అసౌకర్యం గురయ్యారని, వారందరూ మన్నించాలని కోరారు. పోలీసులు అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని.. ఇంకా బీఆర్ఎస్ నాయకులకు కుమ్ము కాయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Latest News

Read More...
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.

25-11-2026 10:33 pm

స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.
స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.

25-11-2026 10:22 pm

బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య
బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య

25-11-2026 09:12 pm

మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!
మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!

25-11-2026 08:56 pm

చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm