పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి,ఇద్దరు అదుపులో, నలుగురు పరారీ.

Views :0
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి,ఇద్దరు అదుపులో, నలుగురు పరారీ.

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి,ఇద్దరు అదుపులో, నలుగురు పరారీ.

నేటి చర్చ : సింగరేణి,నవంబర్ 11,

సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి శ్రీ కోట మైసమ్మ ఆలయ ప్రాంగణంలో గల ఖాళీ స్థలంలోని జామ తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు బ్లూ కోల్ట్స్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి స్థానిక ఎస్సై వి. రమేష్ హఠాత్తుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అక్కడ బోడ సంతోష్, లాకవత్ చింటు, మూడు వినోద్, భూక్యా రాజేష్, లాకవత్ రత్నం, మూడు రవి అనే ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగతా నలుగురు అక్కడికక్కడే పరారయ్యారు.

అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి ₹13,200 నగదు, ఒక ఆటో, రెండు మొబైల్ ఫోన్లు మరియు పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని, మండలంలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రమేష్ హెచ్చరించారు.

Latest News

Read More...
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.

25-11-2026 10:33 pm

స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.
స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.

25-11-2026 10:22 pm

బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య
బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య

25-11-2026 09:12 pm

మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!
మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!

25-11-2026 08:56 pm

చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm